అక్షరటుడే, కామారెడ్డి: Ganesh Immersion Celebrations | పట్టణం (Kamareddy)లో అన్నిశాఖల సమన్వయంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిశాయని మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
Ganesh Immersion Celebrations | డీజే చప్పుళ్లు లేకుండా..
డీజే చప్పుళ్లు లేకుండా డప్పు వాయిద్యాలు, డోలు విన్యాసాలతో భక్తి పారవశ్యంతో కులమతాలకు అతీతంగా పండగ వాతావరణంలో శోభయాత్ర జరిగిందని ఛైర్పర్సన్ కొనియాడారు. నవరాత్రుల ప్రారంభం నుండి నిమజ్జనం పూర్తయ్యే వరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజల సహకారం, వివిధ గణేష్ మండపాల నిర్వాహకుల క్రమశిక్షణ వల్లనే నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతమైందన్నారు.
Ganesh Immersion Celebrations | అన్ని శాఖలు సమష్టిగా..
నిమజ్జన వేడుకలను పటిష్టంగా నిర్వహించడంలో రాత్రింబవళ్లు శ్రమించిన మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్ శాఖ అధికారులు, పోలీసు యంత్రాంగానికి, అలాగే సహకరించిన మీడియా మిత్రులకు మున్సిపల్ ఛైర్పర్సన్ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలో గురువారం రాత్రి 9 గంటల వరకు సుమారు 451 భారీ వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగాయని, అదే విధంగా సుమారు వంద వరకు చిన్న విగ్రహాలు కూడా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా కామారెడ్డి పట్టణాభివృద్ధికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ ఇదే విధంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Ganesh immersion procession | ఇందూరులో అట్టహాసంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం