అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Ganesh immersion procession | నగరం (Nizamabad)లో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల జయజయధ్వానాల మధ్య, డప్పు చప్పుళ్ల సందడిలో శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
Ganesh immersion procession | కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ
దుబ్బలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అందంగా ముస్తాబు చేసిన రథంపై గణనాథులను కూర్చోబెట్టగా.. మధ్యాహ్నం 2.30 గంటలకు యాత్ర ప్రారంభమైంది. పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ కూరగాయల ఉమారాణి కలిసి జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. రథాన్ని ప్రారంభించేందుకు మేమంటే మేమని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటీపడ్డారు.
ఇది కూడా చదవండి..: Ganesh Immersion Nizamabad | గణపతుల బావి వద్ద భక్తుల సందడి.. భక్తిశ్రద్ధలతో బొజ్జ గణపయ్యల నిమజ్జనం