Right to Information Act | సమాచార హక్కు చట్టంతో పారదర్శకత, జవాబుదారీతనం: చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Right to Information Act | ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే స.హ. చట్టం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్​లో(Nizamabad Collectorate) పీఐవో, ఏపీఐవోలు, అన్నిశాఖల అధికారులకు అవగాహన సదస్సు (RTI awareness seminar) నిర్వహించారు.

Right to Information Act | సమాచారం అందుబాటులో ఉంటేనే..

చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని అన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం ప్రజలకు సంబంధించినదే అయినందున దానిని వారికి తెలుపడంలో అలసత్వ వైఖరి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

Right to Information Act | 20 జిల్లాల్లో..

ఇప్పటివరకు 20 జిల్లాలలో రాష్ట్ర సమాచార కమిషన్ (telangana government) పర్యటించిందని, సుదీర్ఘ కాలం నుండి పెండింగ్​లో ఉన్న పాత కేసులు అన్నింటిని పరిష్కరించామన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరుకున్న సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నందున పీఐవోలు, అధికార యంత్రంగాలు ప్రజల పక్షాన ఆలోచించి అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ.. అధికార యంత్రంగాలు, పీఐవోలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

Right to Information Act | సమాచార హక్కు చట్టం అమలు..ఉద్దేశాలు..

సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అమలు, ఉద్దేశాలు, 4(1)b కింద ఇచ్చే సమాచారం తెలియజేస్తూ రిజిస్టర్లలో అప్డేట్ చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాలపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టంలోని 6(3) కింద దరఖాస్తును చక్కగా చదివి ఆకళింపు చేసుకోవాలన్నారు. స.హ. చట్టం కింద వచ్చే దరఖాస్తులు అనగానే అనేక మంది ఆందోళనకు గురి అవుతారని, ఎలాంటి అనుమానాలు, అపోహలకు గురి కాకుండా దరఖాస్తుదారు కోరిన మేరకు రికార్డులలో ఉన్న సమాచారాన్ని అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్​ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya), అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీఎఫ్​వో సిద్ధార్థ్ విక్రం సింగ్, అదనపు డీసీపీ ప్రకాశ్, డీఆర్​వో గీత, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Digital Health Cards| ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ నివేదికపై సర్కార్ క్లారిటీ

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *