నిజామాబాద్Maize Transport Process | మొక్కజొన్న పంటను వెనువెంటనే గోడౌన్లకు తరలించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

Maize Transport Process | మొక్కజొన్న పంటను వెనువెంటనే గోడౌన్లకు తరలించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

రైతుల పంట ఉత్పత్తులను సేకరించిన అనంతరం వెనువెంటనే గోడౌన్లకు తరలించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Maize Transport Process | రైతుల పంట ఉత్పత్తులను సేకరించిన అనంతరం వెనువెంటనే గోడౌన్లకు తరలించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (nizamabad collector Ila Tripathi) ఆదేశించారు. మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండాలో మార్క్​ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని (maize procurement) గురువారం తనిఖీ చేశారు. అలాగే శ్రీనగర్ శివారులోని గోడౌన్​ను సైతం సందర్శించారు.

Maize Transport Process | కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా..

ముందుగా కొనుగోలు కేంద్రంను తనిఖీ చేసిన కలెక్టర్​.. రైతులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. మొక్కజొన్న పంట నాణ్యత, తేమ శాతంను స్వయంగా పరిశీలించిన ఆమె.. ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషీన్ (Electronic Weighing Machine) ద్వారా తూకం సరిగా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. రైతులు పంట ఉత్పత్తులు కేంద్రానికి తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటే వెంటనే తూకం వేయించాలన్నారు. సేకరించిన పంటను వెనువెంటనే గోడౌన్లకు తరలించాలని ఆదేశించారు.

అకాల వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున త్వరితగతిన మొక్కజొన్న నిల్వలను గోడౌన్లకు తరలించి జాగ్రత్తగా భద్రపర్చాలన్నారు. అవసరమైన సంఖ్యలో హమాలీలను సమకూర్చుకుని, మొక్కజొన్న రవాణాలో జాప్యానికి తావులేకుండా సరిపడా లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని సూచించారు. రైతులకు నిర్దిష్ట గడువు లోపు బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు ఏ దశలోనూ అసౌకర్యం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని అన్నారు.

Maize Transport Process | శ్రీనగర్​లోని గౌడౌన్​ పరిశీలన

అనంతరం శ్రీనగర్​లోని గోడౌన్​ను కలెక్టర్ సందర్శించారు. మొక్కజొన్న నిల్వల అన్​లోడింగ్ తీరును, మొక్కజొన్న బస్తాలను భద్రపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. గోడౌన్​లో పూర్తి సామర్థ్యం మేరకు పంటను నిల్వ చేయాలని, పంటకు ఎలాంటి నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న స్టాక్‌ను త్వరితగతిన తరలించేందుకు తగినన్ని లారీలు, ఇతర రవాణా వాహనాలను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు, ట్రాన్స్​పోర్ట్ కాంట్రాక్టర్​ను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోళ్లను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ రేఖా నాయక్, ఎంపీడీవో నరేష్, మార్క్​ఫెడ్ సిబ్బంది భాస్కర్ తదితరులున్నారు.

coll2

ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bandi Bhagirath POCSO Case| భగీరథ్ పోక్సో కేసులో ఊహించని మలుపు.. బాధితురాలి వయసుపై కోర్టులో సంచలన వాదనలు!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Bandi Bhagirath POCSO Case|కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

Stock Market Rally | వాల్యూ బయ్యింగ్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Rally | అమెరికా, చైనాల...

Voter List Revision| మూడో దశ ఎస్‌ఐఆర్‌ షురూ.. ఏపీ, తెలంగాణ సహా 16 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాల ధృవీకరణ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Voter List Revision|భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాలను...

Bakrid Security Measures | బక్రీద్‌కు పటిష్ట భద్రత: ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Bakrid Security Measures | రానున్న బక్రీద్ (Bakrid)...