Kamareddy ISRO Tour | పదోతరగతి బాలికలకు గుడ్​న్యూస్​.. ఇస్రో టూర్​కు ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్

కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న బాలికలకు ఇస్రో ఎక్స్​పోజర్ విజిట్​లో భాగంగా ఆన్​లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy ISRO Tour | జిల్లాలోని (Kamareddy) ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న బాలికలకు ఇస్రో ఎక్స్​పోజర్ విజిట్​లో భాగంగా ఆన్​లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్ ప్రకటన విడుదల చేశారు.

Kamareddy ISRO Tour | మెరిట్​ సాధించిన 50మంది బాలికలకు..

ఈ పరీక్షలో మెరిట్​ సాధించిన 50మంది బాలికలను ఇస్రో శ్రీహరికోట (ISRO Sriharikota) టూర్​కు తీసుకెళ్లనున్నారని మల్లికార్జున్​ తెలిపారు. ఆన్​లైన్ పరీక్ష ఈనెల 31న నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షలో పాల్గొనే విద్యార్థినులు గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరీక్షా వేదిక విద్యార్థుల నమోదు ఆధారంగా డివిజన్లలో లేదా జిల్లాలో నిర్వహించాలనేది నిర్ణయించనున్నారని పేర్కొన్నారు. పరీక్ష సిలబస్​లో గణితం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు, భౌతికశాస్త్రం 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అంతరిక్ష శాస్త్రం ఉంటుందన్నారు. అంతరిక్ష శాస్త్రంలో భారతదేశం అంతరిక్ష శాస్త్రానికి చేసిన కృషి, అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు, సౌర వ్యవస్థ, గ్రహాలు, గెలాక్సీలు విశ్వం, రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష మిషన్లు, వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, అంతరిక్ష అన్వేషణ, భవిష్యత్ అంతరిక్ష అన్వేషణ అంశాలు ఉంటాయన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి సిద్దరాంరెడ్డిని 9697982888 ద్వారా సంప్రదించాలని సూచించారు.

ఇది కూడాచదవండి: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *