Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు..

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi), పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (CP Sai Chaitanya) అధికారులను ఆదేశించారు. బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్​లో జంతు సంక్షేమం, గోవధ నిషేధంపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.

Illegal Cattle Transport | పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలి..

బక్రీద్(Bakrid) పండుగను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. జంతు సంక్షేమం కోసం ఉద్దేశించిన చట్టాల ఉల్లంఘన జరగకుండా చూడాలని అన్నారు. గోవధ నిషేధ చట్టం ప్రకారం గోవులను వధించడంపై నిషేధం ఉందని, తెలంగాణాలో ఒంటెలను కూడా వధించకుండా నిషేధం అమలులో ఉందన్నారు. ఈ విషయాలపై ప్రజలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఎక్కడ కూడా గోవులు, ఒంటెలను వధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Illegal Cattle Transport | పశువులను స్లాటర్​ హౌస్​లలోనే వధించాలి..

పశువులను స్లాటర్ హౌజ్​లలోనే(Slaughter house) వధించాలని, రోడ్లపై ఎక్కడబడితే అక్కడ వధించరాదని కలెక్టర్​, సీపీ సూచించారు. పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి ముందు తప్పనిసరిగా పశు వైద్యాధికారిచే ధ్రువీకరణ పొందాలని అన్నారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అన్ని చోట్ల సరిపడా సంఖ్యలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.

పశువుల అక్రమ రవాణాను నిరోధించేందుకు జిల్లాలోని కందకుర్తి(Kandakurthi), సాలూర, పొతంగల్, ఖండ్​గావ్ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు, సాటాపూర్, యంచ, ఇందల్వాయి, ఉమ్మెడ, జన్నెపల్లి, మామిడిపల్లి తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేకంగా అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్ దుర్గా ప్రమీల, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, నిజామాబాద్, ఆర్మూర్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, ఎంవీఐలు కిరణ్, శ్రీనివాస్, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ గంగాధరయ్య, పోలీస్, రెవెన్యూ, పశు సంవర్ధక, పంచాయతీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | బండి భగీరథ్ అరెస్ట్​ తప్పదా.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *