Rahul Gandhi Protest | రాహుల్​గాంధీ దిష్టిబొమ్మ దహనం

నీట్​ అంశాన్ని పార్లమెంట్​లో చర్చించకుండా ప్రధాని మోదీ ఇంటిని రాహుల్​గాంధీ ముట్టడించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షుడు మల్లాయల సుభాష్​ విమర్శించారు.

shashi kiran Mottala

అక్షటుడే, పెద్ద కొడప్​గల్: Rahul Gandhi Protest | నీట్​ అంశాన్ని పార్లమెంట్​లో చర్చించకుండా ప్రధాని మోదీ (PM Modi) ఇంటిని రాహుల్​గాంధీ ముట్టడించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ మండల అధ్యక్షుడు మల్లాయల సుభాష్​ విమర్శించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని గాంధీ చౌక్​లో  రాహుల్​గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Rahul Gandhi Protest | నీట్​ రాసిన విద్యార్థులు ఆందోళనలో లేరు

ఆయన మాట్లాడుతూ.. నీట్​ పరీక్షలు రాసిన విద్యార్థులు గాని వారి తల్లిదండ్రులు కాని ఆందోళనల్లో పాల్గొనలేదన్నారు. నీట్​ పరీక్షలు రాసిన వారేమో సంతోషంగా ఉంటే ఈ పరీక్షకు సంబంధం లేని వారు ప్రధాని నివాసాన్ని ముట్టడించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. తెలంగాణలో పది, ఇంటర్​ పరీక్షల పేపర్లు లీక్​ కాగా.. ఇక్కడి విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయలేదో సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. నిరసన కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ekadashi Celebrations | భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *