Foreign Funding Allegations | సీజేపీకి విదేశీ నిధులు.. కేంద్రం క్లారిటీ

సీజేపీ నిరసనలకు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయని అనడానికి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్రం తెలిపింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Foreign Funding Allegations | నీట్ పేపర్​ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్​ జనతా పార్టీ (Cockroach Janata Party) ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలకు విదేశాల నుంచి నిధులు అందుతున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

నీట్ పేపర్ లీక్‌పై జరుగుతున్న ప్రస్తుత నిరసనలకు విదేశీ నిధుల ప్రమేయం, భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలపై తమ వద్ద పంచుకోవడానికి ఎలాంటి సమాచారం లేదా ఏమీ లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, “ఈ విషయంపై పంచుకోవడానికి నా వద్ద ఎలాంటి సమాచారం లేదు” అని అన్నారు. నిరసనకారులపై ఎలాంటి కేసు పెట్టబోమని, పరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరుపుతామని, నీట్ పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రం మూడు లిఖితపూర్వక హామీలు ఇవ్వడంతో వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించారు.

Foreign Funding Allegations | నకిలీ వీడియోలు.. ఫేక్​ వార్తలు

సీజేపీ నిరసనల వేళ ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులను బెదిరిస్తున్నట్లు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లుగా ఏఐ రూపొందించిన వీడియోలను కొంతమంది షేర్​ చేనశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిరసనకారులను బెదిరిస్తున్నట్లుగా మార్ఫింగ్ చేసిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలను వైరల్​ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Delhi Protest Violence | ఢిల్లీ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు.. 2 వేల మందిని గుర్తించిన పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *