Honda Bikes | క్రేజీ హోండా.. ఒకేసారి 10 మోడళ్ల ఆవిష్కరణ

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఒకేసారి పది మోడళ్లను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Honda Bikes | భారత టూవీలర్ మార్కెట్ పై తన పట్టును మరింత పెంచుకునేందుకు హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle) అండ్ స్కూటర్ ఇండియా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. వినియోగదారులకు కొత్త మోడళ్లను పరిచయం చేస్తోంది. తన టూవీలర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ తాజాగా ఒకేసారి పది మోడళ్ల ద్విచక్ర వాహనాలను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. ఇందులో ఏడు పూర్తిగా కొత్తవి కాగా.. మిగతా మూడు మోడళ్లను సరికొత్త కలర్ ఆప్షన్లతో రీఫ్రెష్డ్ వర్షన్లుగా తీసుకురానుంది.

Honda Bikes | కొత్త మోడళ్లు ఇవే..

హోండా ఏడీవీ 160, హోండా సీబీ 500, హోండా రెబెల్ 300, హోండా రెబెల్ 500, హోండా ఎక్స్ ఆర్ 300ఎల్, హోండా ఎక్స్ ఆర్ 300 ర్యాలీ, హోండా క్యూసీ 3 ఈవీ.

Honda Bikes | త్వరలోనే మార్కెట్ లోకి..

హోండా ఆవిష్కరించిన వాటిలో స్కూటర్లు, రోడ్‌స్టర్, క్రూయిజర్, అడ్వెంచర్ విభాగానికి చెందిన టూవీలర్లు ఉన్నాయి. ఇవి ఐసీఈ, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఫ్లెక్స్ ఫ్యుయల్ ఆప్షన్‌తో లభించనున్నాయి. కొత్త పెట్రోల్ మోడళ్లను ఈ85 ఇంధనంతో నడిచే ‘ఫ్లెక్స్ ఫ్యుయల్’ ఇంజన్లతో తీసుకురానున్నారు. ఈ మోడళ్లను దశలవారీగా దేశీయ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా ధరను తర్వాత ప్రకటించనున్నట్లు పేర్కొంది.

ఇది కూడా చదవండి..: NEET Protest | విద్యార్థులపై పెల్లెట్ గన్ల‌తో పోలీసుల దాడులు.. కేంద్రంపై రాహుల్ ఫైర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *