అక్షరటుడే వెబ్‌డెస్క్: Chandrababu School Visit | పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొని స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనశాలలో కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యత గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆరా తీశారు. “భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా?” అని విద్యార్థులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, విద్యార్థుల్లో విటమిన్ లోపాలను నివారించేందుకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
Chandrababu School Visit | విద్యార్థులందరికీ కంటి పరీక్షలు ..
ముఖ్యమంత్రి సూచనలపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ, ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని వివరించారు. విద్యార్థులందరికీ కంటి పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. అల్పాహారంగా ఏమైనా అందిస్తున్నారా అని సీఎం అడగగా, ఉదయం పూట రాగి మాల్ట్, మధ్యాహ్న భోజనంతో పాటు చిక్కీ కూడా అందిస్తున్నామని లోకేశ్ బదులిచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచన చేస్తూ, విద్యార్థులు ఇంటికి వెళ్లే సమయంలో స్నాక్‌గా చిక్కీలు అందించే ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని తెలిపారు. భోజనం అనంతరం పలువురు విద్యార్థులు ముఖ్యమంత్రితో కలిసి ఫొటోలు దిగాలని కోరారు. వారి అభ్యర్థనకు వెంటనే స్పందించిన చంద్రబాబు, విద్యార్థులతో ప్రత్యేకంగా ఫొటోలు దిగి వారిని ఆనందపరిచారు. సీఎం, మంత్రి నేరుగా తమతో కలిసి భోజనం చేయడం, ఆప్యాయంగా పలకరించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్
AP CM Chandrababu Naidu and Minister Nara Lokesh Share Mid-Day Meal with Government School Students
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Minister Nara Lokesh… pic.twitter.com/yqA9D6Xp08
— Akshara Today | Telugu News (@aksharatoday) July 24, 2026
ఇది కూడా చదవండి: BJYM District President | కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం..