అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Junior Colleges | జిల్లా (Nizamabad)లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మంజూరైన నిధులతో త్వరగా సివిల్, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని డీఐఈవో రవికుమార్ పేర్కొన్నారు. శుక్రవారం డీఐఈవో కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.
Junior Colleges | కొనుగోలు చేయాలి
కళాశాలల్లో ఎలక్ట్రికల్, ఇతర మరమ్మతులకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లను వెంటనే పూర్తిచేయాలని డీఐఈవో పేర్కొన్నారు. అలాగే కళాశాలలో విద్యార్థులు కూర్చునే ఫర్నిచర్కు సైతం మరమ్మతులు చేయించాలన్నారు. ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లకు లెక్చరర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు అధ్యాపకులకు కేటాయించిన తేదీల్లో హాజరయ్యే విధంగా ప్రిన్సిపాళ్లు తగిచర్యలు తీసుకోవాలని డీఈఐవో ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరంలో మరిన్ని అడ్మిషన్లను పెంచేందుకు గాను కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఇదివరకే అడ్మిషన్లు ఆయిన విద్యార్థుల యూడైస్, ఆధార్ అప్డేట్లు వెంట వెంటనే చేయించాలని ఆదేశించారు. అధ్యాపకుల కొరత ఉన్న కళాశాలల్లో వెంటనే అతిథి అధ్యాపకులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.బోధన, బోధనేతర సిబ్బంది ఖచ్చితంగా సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Land Acquisition | జాప్యం లేకుండా భూసేకరణ చేపట్టాలి..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్