CP Sai Chaitanya | బ్యాంకులు, నగల దుకాణాల్లో భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలి : సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: CP Sai Chaitanya | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో బ్యాంకులు, నగల దుకాణాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకోవాలని సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో (Nizamabad police) బ్యాంకు అధికారులు, జ్యువెలరీ వ్యాపారస్థులు, బంగారు వెండి వర్తక సంఘాల ప్రతినిధులతో సోమవారం సమావేశం నిర్వహించారు.

CP Sai Chaitanya | అప్రమత్తంగా ఉండాలి

జిల్లాకు 44వ జాతీయ రహదారి దగ్గరగా ఉండడం.. మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దుగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సీపీ సూచించారు. నేరస్థులు జిల్లాలోకి ప్రవేశించి తొందరగా బయటపడే ఆస్కారం ఉన్నందున వ్యాపార సంస్థలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, అలారం, సెక్యూరిటీ గార్డుల వ్యవస్థను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు.

CP Sai Chaitanya | అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే..

ఆయా వ్యాపార సంస్థల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని పోలీస్​ బాస్​ సూచించారు. నగదు, బంగారం రవాణా సమయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి, నిజమాబాద్ రూరల్ సీఐ సతీష్ కుమార్, సీసీఆర్పీ సీఐ అంజయ్య, లీడ్​బ్యాక్​ మేనేజర్​ సునీల్​కుమార్​, నిజామాబాద్ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్, గోల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్  పాల్గొన్నారు.

cp1

ఇది కూడా చదవండి: Vijay TVK Victory|తమిళ రాజకీయం ‘విజయ్’మయం.. ద్రావిడ కోటలు బద్ధలు కొట్టిన టీవీకే!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *