Fee Reimbursement | తెయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్​ను ముట్టడించిన విద్యార్థులు

తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఛాంబర్​ను ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Fee Reimbursement | తెలంగాణ యూనివర్సిటీలోని (Telangana University) ఆర్ట్స్ కళాశాల(Arts College) ఛాంబర్​ను ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఫీజు రీయింబర్స్​మెంట్​కు అర్హులైన విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Fee Reimbursement | జీవోను పక్కనపెట్టి..

ఏబీవీపీ (ABVP) ఇందూర్ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్​మెంట్​కు అర్హులైన విద్యార్థుల నుండి అడ్మిషన్ రోజే కోర్సు ఫీజులు కట్టించుకోవడం సిగ్గుచేటన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను ప్రభుత్వం విడుదల చేశాక విద్యార్థుల నుండి వారం రోజుల్లో ఫీజులు తీసుకోవాలని జీవోలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ విషయాన్ని తుంగలో తొక్కి విచ్చలవిడిగా విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అలాట్​మెంట్​ ఆర్డర్లలో ఫీజు రీయింబర్స్​మెంట్​కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఎలాంటి రుసుము లేకున్నప్పటికీ, రూల్స్​కు విరుద్ధంగా అధికారుల వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు.

ఇకనైనా అధికారులు జీవో, అలాట్​మెంట్​ ఆర్డర్లలో పొందపరిచిన రూల్స్​ను పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయవద్దని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఏబీవీపీ వెనకాడబోదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ సెక్రెటరీ సమీర్, ప్రాంత వనవాసి కన్వీనర్ అశోక్, శివ, మనోజ్, భార్గవ్, దుర్గ దాస్, విజయ్, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

TU

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *