Pawan Kalyan Health | వైద్య పరీక్షల కోసం ముంబయికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చికిత్స కోసం ముంబయికి బయలుదేరారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pawan Kalyan Health | కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) చికిత్స కోసం ముంబయికి బయలుదేరారు. ఆయనకు ‘రొటేటర్ కఫ్’ (Rotator Cuff) అనే సమస్య ఉన్నట్లు సమాచారం. ఈ సమస్య కారణంగా రెండు భుజాల కండరాలు చిట్లడంతో, తీవ్ర అసౌకర్యానికి గురవుతున్న ఆయన, వైద్యుల సలహా మేరకు పరీక్షల కోసం వెళ్లారు.

Pawan Kalyan Health | కోకిలాబెన్ ఆస్పత్రిలో పరీక్షలు

పవన్ కల్యాణ్ ముంబయిలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులను సంప్రదించనున్నారు. అక్కడ ఆయనకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన తదుపరి చికిత్సను అందించనున్నారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి అన్నా కొణిదెల కూడా ఉన్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక వివరాలను జనసేన పార్టీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంచుకుంది. పవన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.
pawan.1 5

ఇది కూడా చదవండి: Telangana Rice Exports | బియ్యం ఎగుమతులకు ప్రోత్సాహకాలు!.. మంత్రి ఉత్తమ్​ కీలక వ్యాఖ్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *