Eluru Ambulance Incident | గుంతలో ఎగిరిపడ్డ అంబులెన్స్​..లేచి కూర్చున్న చనిపోయిందనుకున్న మహిళ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Eluru Ambulance Incident | ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైద్యులు మరణించినట్లు నిర్ధారించిన ఓ మహిళను అంత్యక్రియలకు తరలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా జీవం ఉన్నట్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Eluru Ambulance Incident | అంత్యక్రియలకు తరలిస్తుండగా..

కైకలూరు మండలం భుజబలపట్నం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గురజాల రామతులసి అనారోగ్యంతో ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది.

Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న ఓ పెద్ద గుంతలో అంబులెన్స్ బలంగా కుదుపులకు గురైంది. ఆ కుదుపుల వల్ల మహిళ శరీరంలో స్వల్ప కదలికలు కనిపించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు ప్రయాణాన్ని నిలిపివేసి ఆమెను అత్యవసరంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Eluru Ambulance Incident | ఐసీయూలో చికిత్స

వైద్యులు ఆమెను పరీక్షించి ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై వైద్య వర్గాల్లోనూ, ప్రజల్లోనూ పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదట మరణాన్ని ఎలా నిర్ధారించారు? అనంతరం కదలికలు ఎలా గుర్తించారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి అధికారిక వైద్య నివేదిక వెలువడాల్సి ఉంది.

ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చకు దారితీసింది. అయితే వైద్యపరమైన పూర్తి వివరాలు, అధికారిక నివేదిక వెలువడిన తర్వాతే అసలు పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *