Ambati Rambabu Case | ఏఐ వీడియోపై ఫిర్యాదు..మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

వీడియో మూలం, దాని సృష్టి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన తీరు వంటి అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu Case | ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్​పై తప్పుడు ప్రచారం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Ambati Rambabu Case | మద్దిరాల ఫిర్యాదు మేరకు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుడు మద్దిరాల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్లు వేసినట్లు చూపిస్తూ కృత్రిమ మేధ (AI) సాంకేతికతతో తప్పుడు వీడియో రూపొందించి, ప్రచారం చేశారనే ఆరోపణలను ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ వీడియో ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారు కోరినట్లు తెలుస్తోంది.

Family Asset Trust | ఆస్తి రక్షణకు ధనికుల ఫైనాన్స్ సీక్రెట్: తరతరాలుగా సిరిసంపదలను కాపాడే ‘ట్రస్ట్’ విధానం!

Ambati Rambabu Case | సీఐడీ దర్యాప్తు

ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో మూలం, దాని సృష్టి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన తీరు వంటి అంశాలపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.

కేసుకు సంబంధించి అంబటి రాంబాబు లేదా ఆయన తరఫున అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *