అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana New Ration Cards | తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు మరో తీపి కబురు అందించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న రాష్ట్రంలో నూతన పీడీఎస్ (PDS) రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో సీఎం పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే, రాష్ట్రంలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు కార్డులను నేరుగా అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Telangana New Ration Cards | స్మార్ట్ కార్డులు..
ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ (పీవీసీ) రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులను అందించనున్నారు. వాటర్‌ప్రూఫ్, క్రెడిట్ కార్డు పరిమాణంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్‌తో (QR Code) పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు.
Telangana New Ration Cards | కలెక్టర్లకు కీలక ఆదేశాలు..
రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాల ధృవీకరణను (e-KYC) త్వరితగతిన పూర్తి చేయాలి. రేషన్ కార్డుల ముద్రణ స్థాయి నుండి జిల్లాలకు చేరే వరకు సురక్షితమైన రవాణా నిర్వహణపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. పంపిణీ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలి. పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల కల నెరవేరనుంది.
Statewide Distribution of 1.05 Crore newly sanctioned and laminated Ration Cards to Begin on Independence Day
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన, లామినేట్ చేసిన పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2026 స్వాతంత్ర్య… pic.twitter.com/FKnz8U41L5
— Congress for Telangana (@Congress4TS) August 6, 2026
ఇది కూడా చదవండి: Naini Coal Block | తెలంగాణకు చేరుకున్న ఒడిశా నైనీ బ్లాక్ బొగ్గు