Tarun Tejpal | లైంగిక దాడి కేసు.. ‘తెహల్కా’ తరుణ్ తేజ్​పాల్​ను దోషిగా తేల్చిన కోర్టు

తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్​ తేజ్​పాల్​కు కోర్టు షాక్​ ఇచ్చింది. 2013 నాటి లైంగిక దాడి కేసులో అతడిని దోషిగా నిర్ధారించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tarun Tejpal | తెహల్కా పత్రిక వ్యవస్థాపకుడు తరుణ్​ తేజ్​పాల్​కు కోర్టు షాక్​ ఇచ్చింది. 2013 నాటి లైంగిక దాడి కేసులో గోవాలోని బాంబే హైకోర్టు (Bombay High Court) అతడిని దోషిగా నిర్ధారించింది.

తరుణ్ తేజ్‌పాల్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2013లో తన జూనియర్ సహోద్యోగి దాఖలు చేసిన అత్యాచారం కేసులో గోవా హైకోర్టు గురువారం ఆయనను దోషిగా నిర్ధారించింది. 2021లో ట్రయల్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేయగా, ఆ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుపై గోవా ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఇరుపక్షాల వాదనలను క్షుణ్ణంగా విన్న తర్వాత జస్టిస్‌ డాక్టర్ నీలా గోఖలే, అమిత్ జమ్సందేకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

Tarun Tejpal | లిఫ్ట్​లో..

గోవాలో జరిగిన థింక్‌ఫెస్ట్ కార్యక్రమం సందర్భంగా 2013 నవంబర్‌లో ఒక హోటల్ ఎలివేటర్‌లో ఆ సీనియర్ జర్నలిస్ట్ తనపై లైంగిక దాడి చేశారని ఒక మాజీ జూనియర్ సహోద్యోగి ఫిర్యాదు మేరకు తేజ్​పాల్​పై కేసు నమోదు అయింది. దీనిపై 2017లో మపుసా ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభం కాగా, 2021లో తేజ్‌పాల్ నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా, లైంగిక దాడి బాధితురాలు ఎలా ప్రవర్తించాలనే దానిపై ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాల ఆధారంగా ఫిర్యాదుదారురాలి ప్రవర్తనను అంచనా వేయడం ద్వారా సెషన్స్ కోర్టు తీవ్రమైన పొరపాటు చేసిందని మెహతా వాదించారు. దీంతో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా విడుదల చేస్తూ మపుసాలోని సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు గోవా బెంచ్ గురువారం కొట్టివేసింది. శిక్షా నిర్ణయంపై విచారణ కోసం ఈ కేసును మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు.

ఇది కూడా చదవండి..: Rahul Gandhi on Modi | మోదీ, అమిత్​ షాకు ధైర్యం లేదు : రాహుల్ గాంధీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *