Karnataka Family Tragedy | ఐదుగురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య

కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఐదుగురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Karnataka Family Tragedy | కర్ణాటకలో ( Karnataka )తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయపుర సమీపంలోని భూతనాల చెరువులో మృతదేహాలు తేలియాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతులను శోభ జాలగెరి (45), ఆమె పిల్లలు విద్య (16), సువర్ణ (14), గౌడేష్ (10), శానిక (7), వికాస్ (5)గా గుర్తించారు.

Karnataka Family Tragedy | అసలు ఏం జరిగిందంటే..

మృతురాలు శోభ భర్త భీమరాయ మద్యానికి బానిసయ్యాడని, కుటుంబ పోషణ భారంగా మారడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శోభ తన ఐదుగురు పిల్లలతో కలిసి ఈనెల 24న ఇంటి నుంచి వెళ్లిపోయింది. తాము ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించి మరీ వెళ్లినట్లు ఆమె భర్త ఆదర్శనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన వీరంతా బుధవారం ఉదయం చెరువులో శవాలుగా తేలడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Nizamabad Student Death | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్​ వాసి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *