అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Minority Welfare Telangana | మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మైనార్టీలనుద్దేశించి నగరంలోని నెహ్రపార్క్ వద్ద ఆయన ప్రసంగించారు.
Minority Welfare Telangana | భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి
పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్ మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో మైనారిటీలు భారీ బైక్ ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా పోలీసులు భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Student Death | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నిజామాబాద్ వాసి మృతి