Bandi Bhagirath Case | బండి భగీరథ్ అరెస్ట్​ తప్పదా.. నోటీసులు జారీ చేసిన పోలీసులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhagirath Case | కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay)​ కుమారుడు భగీరథ్​పై నమోదైన పోక్సో కేసు (POCSO Case)లో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా భగీరథ్​కు నోటీసులు జారీ చేశారు.

బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని బండి భగీరథ్​పై పేట్​ బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​లో పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పోలీసులు బాధితురాలి స్టేట్​మెంట్​ రికార్డు చేశారు. అయితే బండి భగీరథ్​ పరారీలో ఉండటంతో అతడి కోసం గాలిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరుకావాలని తాజాగా నోటీసుల్లో పేర్కొన్నారు.

Bandi Bhagirath Case | కోర్టుకు వెళ్లిన భగీరథ్​

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్​ ఇవ్వాలని భగీరథ్​ హైకోర్టు (High Court)లో పిటిషన్​ వేశారు. ప్రస్తుతం కోర్టుకు వేసవి సెలవులు కావడంతో వెకేషన్​ బెంచ్​ ఈ పిటిషన్​ను విచారించనుంది. ఈ నెల 14న వెకేషన్​ బెంచ్​ దీనిపై విచారణ చేపడుతోంది. 13న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు అయితే అతడిని అదుపులోకి తీసుకుంటారని సమాచారం. అయితే భగీరథ్​ విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Bandi Bhagirath Case | పోలీసులకు అప్పగించాలి

బండి సంజయ్ POCSO కేసులో బాధితులను బెదిరించలేదని తడిబట్టలతో హనుమాన్ గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్​ఎస్​ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ డిమాండ్​ చేశారు. ‘నిజమైన హనుమాన్ భక్తుడివైతే నీ కొడుకును పోలీసులకు అప్పగించు’ అని ఆయన అన్నారు.

దీనిని కూడా చదవండి : Indiramma Houses | రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు అప్పుడే.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *