Armoor SIT Probe | ఆర్మూర్​లో వరుస ఘటనలపై ‘సిట్’ వేసి విచారణ జరపాలి

ఆర్మూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై తక్షణమే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Armoor SIT Probe | ఆర్మూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై తక్షణమే సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (MLA Paidi Rakesh Reddy) డిమాండ్ చేశారు. సోమవారం ఆర్మూర్​లో హిందువుల ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు భిక్కనూర్ టోల్​ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు.

Armoor SIT Probe | మతం రంగు పులిమి..

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హిందువుల ర్యాలీ నేపథ్యంలో తాను ఆర్మూర్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్‌ను అగ్నిగుండంగా మారుస్తున్నాయని ఆరోపించారు. వ్యక్తుల మధ్య జరిగిన ఘటనకు మతం రంగు పులిమారన్నారు. పెర్కిట్ పాఠశాలలో మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారని, ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని, విదేశీ నిధులతో మత మార్పిడి చేసే యత్నం జరుగుతోందని ఆరోపించారు. మేమేమైనా 35 లీటర్ల పెట్రోల్ డబ్బాతో తగులబెట్టామా, కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచామా, ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టించామా అని ప్రశ్నించారు.

Armoor SIT Probe | రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దు..

ఆర్మూర్‌లో అలజడి సృష్టిస్తే ఓ వర్గం పెద్దలను పిలిచి మాట్లాడతామని చెప్పినట్లు తెలిపారు. బీజేపీ నాయకుడు చేసిన చెంపదెబ్బ ఘటనను తాను సమర్థించడం లేదని, అయినా హైదరాబాద్ నుంచి గుండాలను పిలిచి రచ్చ చేస్తున్నారన్నారు. దీంతో పగలు, ప్రతీకారాలు పెరుగుతున్నాయని అన్నారు. ఓ వర్గం ప్రజలు కూడా సంఘ విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు నమ్మవద్దని, ఆర్మూర్ ప్రజలు ఆవేశానికి లోనుకావద్దని సూచించారు. అరెస్ట్ చేసిన టీచర్​పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అతని వెనక విదేశీ శక్తులు, తీవ్రవాద సంస్థలు, మత మార్పిడి సంస్థలు ఉన్నాయా అనేది విచారణలో తేల్చాలని కోరారు.

Armoor SIT Probe | కలిసి మాట్లాడుకుందాం..

Armoor SIT Probe

పట్టణంలో మర్కజ్ కమిటీ, హిందూ సంఘాలు అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని, అవసరమైతే అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేసుకుందామని రాకేష్​ రెడ్డి చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా హిందూ ముస్లింలందరం కలిసి ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులను ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారో అందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Olympic Run | యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలి..: పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *