అక్షరటుడే వెబ్‌డెస్క్: Rythu Bharosa | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ‘రైతు ఆశీర్వాద సభ’ను ప్రభుత్వం రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వేదికను హైదరాబాద్‌కు మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Rythu Bharosa | రైతు భరోసా పంపిణీ సదస్సు..
మధిర సభకు బదులుగా, హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు ‘రైతు భరోసా పంపిణీ సదస్సు’ను నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులను, ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు.

Rythu Bharosa |ప్రభుత్వం ప్రత్యేక చర్యలు..
ఈ సదస్సులో రాష్ట్రంలోని రైతులందరినీ భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరూ తమ సొంత ప్రాంతాల్లోని ‘రైతు వేదికల’ వద్దకు చేరుకుని, డిజిటల్ లేదా వర్చువల్ విధానం ద్వారా హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధిర సభ రద్దయినప్పటికీ, రైతులకు పెట్టుబడి సాయం అందించే ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు జారీ చేసారు.
ఇది కూడా చదవండి: Olympic Run | యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనాలి..: పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్