Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Forecast | పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాగర్​ కర్నూల్, గద్వాల్, రంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం వాన పడే ఛాన్స్​ ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నేడు కూడా వర్షం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం వేళ భారీగా ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telangana Rain Forecast | హైదరాబాద్​లో..

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో శంషాబాద్; మహేశ్వరం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. రాత్రిపూట నల్గొండ, భువనగిరి, జనగామ, వరంగల్​, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Streenidhi | స్త్రీనిధితో మహిళల ఆర్థిక స్వావలంబన : మంత్రి సీతక్క

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *