Paddy Procurement Delay | మండుటెండలో కేకేవై రహదారిపై అన్నదాతల ఆందోళన

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement Delay | ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోవాలంటే రైతన్నలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోళ్లు చేసినప్పటికీ రైస్​మిల్లులకు తరలించడంలో జాప్యాన్ని నిరసిస్తూ కేకేవై రహదారిపై రైతులు ఆందోళన చేశారు.

Paddy Procurement Delay | ఆందోళనలో అన్నదాతలు

ఈ సందర్భంగా లింగంపేట మండలంలోని (Lingampet Mandal) భవానీ పేట, జల్దిపల్లి, రాంపూర్ గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ.. కొనుగోళ్లు పూర్తయినప్పటికీ ధాన్యం ఇంకా కేంద్రాల్లోనే పేరుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవానీపేట గ్రామంలో కేంద్రం ప్రారంభించి సుమారు నెలరోజులు పూర్తయి కొంత ధాన్యం కొనుగోళ్లు జరిగినప్పటికీ 100కు పైగా ధాన్యం రాశులు అలాగే ఉండిపోయాయన్నారు. లారీలు రాకపోవడం తూకాలు సరిగ్గా జరగకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Paddy Procurement Delay | మూడు రోజులకు ఒక లారీ..

గ్రామానికి మూడు రోజులకు ఒక లారీ వస్తుందని దానిలో 400 బస్తాలు నుంచి 500 బస్తాలు మాత్రమే వెళ్తున్నాయన్నారు. మిగిలిన ధాన్యం బస్తాలు కేంద్రంలోనే మగ్గుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రంలోనే ధాన్యం విక్రయించేందుకు రైతన్నలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని వారన్నారు.

Paddy Procurement Delay | ముంచుకొస్తున్న కాలం..

ఒకపక్క ధాన్యం కొనుగోలు జరగకపోవడం.. మరో పది రోజులు గడిస్తే వర్షాకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో తమ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని రైతులంటున్నారు. ధాన్యం ఎప్పుడు అమ్ముకోవాలని.. తిరిగి సాగుకు ఎప్పుడు సన్నద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి ఎస్సై దీపక్ కుమార్, ఆర్​ఐ చేరుకొని రైతులను సముదాయించారు.

ఇది కూడా చదవండి..: Paddy Procurement Promises | రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది.: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *