Drug Abuse Awareness | మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: సీపీ సాయిచైతన్య

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drug Abuse Awareness | మత్తు పదార్థాలు తీసుకోవడం ద్వారా యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్​ గ్రౌండ్​లో (Police Parade Ground) ఇటీవల డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారికి, అనుమానితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Drug Abuse Awareness | కుటుంబాలు చిన్నాభిన్నం..

మత్తు పదార్థాల వినియోగం కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని సీపీ అన్నారు. ఆర్థికంగా సామాజికంగా వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరంగా మారుతుందని.. చట్టపరంగానూ తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పోలీసు శాఖ (Nizamabad Police Commissionerate) కఠినచర్యలు తీసుకుంటుందని వివరించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుతంగా జీవించాలన్నారు. మళ్లీ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీయాక్ట్ లాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Drug Abuse Awareness | నిరంతర నిఘా..

జిల్లాలో గంజాయి మత్తు పదార్థాల విక్రయాలు రవాణా వినియోగపై నిరంతర నిఘా కొనసాగుతుందని పోలీస్​బాస్​ సూచించారు. విద్యాసంస్థలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల వద్ద ఎల్లప్పుడూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తున్నా.. కొంటున్నట్లుగా కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్​లో లేదా డయల్​ 100కు ఫోన్ చేయాలన్నారు.

పలువురికి డ్రగ్స్​ పరీక్షలు..

అనంతరం పరేడ్ గ్రౌండ్​కు వచ్చిన అనుమానితులకు డ్రగ్స్​ పరీక్షలు చేశారు. అందులో పాజిటివ్​గా తేలిన వారిని చట్టపరంగా కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. అదనపు డీసీపీ (ఏఆర్) రాంచందర్​ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ ఎం.సోమనాథం, హోంగార్డ్ ఏసీపీ కె.దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ కె.శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్​రాజ్, సౌత్ రూరల్ సీఐ ఎన్ సురేష్ కుమార్, నార్త్ రూరల్ సీఐ బి .శ్రీనివాస్, డిచ్​పల్లి సీఐ కె.వినోద్, ధర్పల్లి సీఐ భిక్షపతి, నిజామాబాద్ డివిజన్ ఎస్​హెచ్​వోలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *