BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పది: కలెక్టర్​

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పదని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. వేసవిలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాలు వారికి ఉపయుక్తంగా నిలుస్తున్నాయన్నారు. బాల్​భవన్​లో (BalBhavan) శనివారం ‘కళా వైభవం – కలర్స్ ఆఫ్ చైల్డ్ హుడ్’ కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్, మేయర్​ ఉమారాణి​ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

BalBhavan Nizamabad | కళాకృతులను తిలకించి.. బహుమతులిచ్చి..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్​.. చిన్నారులు తయారు చేసిన కళాకృతులు, గీసిన చిత్రాలను ఆసక్తితో తిలకించారు. చక్కటి పెయింటింగ్స్ గీసిన 7వ తరగతి విద్యార్థి సాయి రుధిర్ కళా నైపుణ్యాన్ని కలెక్టర్ మెచ్చుకుంటూ, చిన్నారికి బహుమతిని అందించి ప్రోత్సహించారు. పేరిణి, కోలాటం నృత్యాలతో అలరింపజేసిన చిన్నారులను, వెంట్రిలాక్విజంతో ఆకట్టుకున్న జాదూ యుగంధర్ రంగనాథ్​ను సైతం కలెక్టర్ ప్రశంసించారు. ప్రస్తుత వేసవి శిక్షణ తరగతుల్లో బాల్​ భవన్​లో 720 మంది చిన్నారులకు ప్రవేశాలు కల్పించగా, వారికి అందిస్తున్న శిక్షణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

BalBhavan Nizamabad | చిన్నారుల్లో కలిసిపోయి..

సభా వేదిక దిగి కలెక్టర్ చిన్నారుల మధ్యకు వెళ్లి వారికి ఆయా అంశాలపై ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. చిన్నారులు అందరికీ చాక్లెట్లు పంచుతూ, ప్రతిభ చాటిన బాలబాలికలకు బహుమతులు అందించారు. బాలభవన్ ద్వారా చక్కటి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అభినందించారు. చిన్నారులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను బాల భవన్ లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు. శిక్షణ ద్వారా పిల్లల్లోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు.

చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. మేయర్ ఉమారాణి (Mayor Umarani) మాట్లాడుతూ.. నేటి చదువులు ఎంతో ఒత్తిడితో కూడుకుని ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో బాల భవన్ ద్వారా అందిస్తున్న వేసవి శిక్షణ కార్యక్రమాలు చిన్నారులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో డీఈవో అశోక్(DEO Ashok), బాల్​భవన్ సూపరింటెండెంట్ ఉమాబాల, మాజీ పర్యవేక్షకుడు ప్రభాకర్, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

211 453 6767

ఇది కూడా చదవండి: Telangana Rain Forecast | పలు జిల్లాలకు వర్ష సూచన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *