అక్షరటుడే, వెబ్డెస్క్: CBSE Three Language Rule | సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటన చేసింది. సీబీఎస్ఈ 9, 10వ తరగతుల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు సాధారణంగా రెండు భాషలు మాత్రమే ఉండేవి. ఇందులో ఇంగ్లిష్, తెలుగు లేదా హిందీ ఉండేంది. కాగా.. తాజా నిర్ణయంతో సీబీఎస్ఈ నూతన లాంగ్వేజ్ 2026 నుంచి పదో తరగతి విద్యార్థులు మూడు భాషలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే థర్డ్ లాంగ్వేజ్ (Third Language)గా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టుకు సంబంధించి బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం లేదు.
CBSE Three Language Rule | కొత్త సర్క్యులర్ వివరాలివే..
సీబీఎస్ఈ 9, 10 తరగతుల విద్యార్థుల లాంగ్వేజ్ అధ్యయనం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం.. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త పద్ధతి అమలులోకి రానుంది. లాంగ్వేజ్ విద్య అనేది నూతన జాతీయ విద్యావిధానం 2020 ఎన్సీఈఆర్టీ అప్ గ్రేడ్ చేసిన ప్రణాళికకు అనుగుణంగా ఉండనుంది.
CBSE Three Language Rule | మూడు భాషల ఎంపిక
నూతన విద్యాసంవత్సరం నుంచి 9వ తరగతి స్టూడెంట్స్ మూడు భాషలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో రెండు భారతీయ భాషలై ఉండాలి. మూడో భాషగా ఒక విదేశీ భాషను ఎంచుకునేందుకు ఛాన్స్ ఉంటుందని బోర్డు తెలిపింది. ఈ విధానం 1 జులై 2026 నుంచి అమల్లోకి తీసుకురానుంది.
CBSE Three Language Rule | నాలుగో భాషగా కూడా..
విదేశీ భాషను అభ్యసించాలనుకునే విద్యార్థులు, రెండు భారతీయ భాషలు అయితేనే దానిని మూడోది విదేశీ భాషగా ఎంచుకునే ఛాన్స్ కల్పించింది. అయితే విద్యార్థులు కోరుకున్నట్లయితే నాలుగో భాషగా కూడా అభ్యసించవచ్చని బోర్డు వెల్లడించింది. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతోనే టెన్త్లో ఎంపిక చేసుకున్న థర్డ్ లాంగ్వేజ్ సంబంధించి బోర్డు పరీక్షను నిర్వహించకూడదని సీబీఎస్ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి..: Telangana ANM Results | ఏఎన్ఎం పరీక్ష ఫలితాలు విడుదల


