Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి అక్రమంగా టీఎఫ్టీ లైసెన్స్ పొందారనే ఫిర్యాదుపై విచారణ జరిపేందుకు జిల్లా ఎక్సైజ్ శాఖ సిద్ధమైంది. హైకోర్టు (High Court) ఆదేశాల మేరకు ఇద్దరు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.

Illegal Toddy License | తెలంగాణ హైకోర్టులో..

తెలంగాణ హైకోర్టులో దాఖలైన కేసులో ఏప్రిల్​లో వెలువడిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి హన్మంత్ రావు తెలిపారు. ఈ మేరకు తాడ్వాయి మండలం కరడ్​పల్లి గ్రామానికి చెందిన కె. స్వామిగౌడ్, ఎస్.సంపత్ కుమార్‌లకు నోటీసులు అందజేశారు. వీరిద్దరూ ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్​లోని జిల్లా ఎక్సైజ్ అధికారి ఛాంబర్‌లో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. తమ వాదనకు మద్దతుగా ఉన్న అన్ని సహాయక పత్రాలను విచారణ సమయంలో సమర్పించాలని అధికారులు సూచించారు.

ఇది కూడా చదవండి..: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతకు వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పది: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *