నిజామాబాద్Care Degree College | అత్యుత్తమ బోధనకు చిరునామా ‘కేర్​ డిగ్రీ కళాశాల’: డైరెక్టర్​ నరాల...

Care Degree College | అత్యుత్తమ బోధనకు చిరునామా ‘కేర్​ డిగ్రీ కళాశాల’: డైరెక్టర్​ నరాల సుధాకర్​

నిజామాబాద్ నగరంలో రెండు దశాబ్దాలకు పైగా అత్యుత్తమైన విద్యనందిస్తూ ప్రత్యేకత చాటుకుంటుందో కేర్​ డిగ్రీ కళాశాల. ఈ కాలేజీలో విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను అమలు చేస్తున్నట్లు డైరెక్టర్​ నరాల సుధాకర్​ తెలిపారు.

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Care Degree College | నగరంలో రెండు దశాబ్దాలకు పైగా అత్యుత్తమైన విద్యనందిస్తూ ప్రత్యేకత చాటుకుంటోంది కేర్​ డిగ్రీ కళాశాల. ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారిని ప్రయోజకులను చేసిన కళాశాలలో ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సులను అమలు చేస్తున్నట్లు కేర్​ డిగ్రీ కళాశాల డైరెక్టర్​ నరాల సుధాకర్​ పేర్కొన్నారు. ఈ మేరకు కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

​Care Degree College | ఆధునిక తరగతి గదులు, ల్యాబ్‌లు..

విద్యార్థులకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించేందుకు అధునాతన సాంకేతికతతో కూడిన స్మార్ట్ తరగతి గదులు, అన్ని సౌకర్యాలతో కూడిన సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నాయని సుధాకర్​ తెలిపారు. ఆయా కోర్సులకు సంబంధించిన పుస్తకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా వేలల్లో పుస్తకాలు, జర్నల్స్, డిజిటల్ లైబ్రరీ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.

Care Degree College | ఎంతో క్రీడాకారులను తయారుచేసిన కళాశాల..

క్రీడలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ.. అంతర్జాతీయస్థాయిలో క్రీడాకారులను తయారుచేసిన అనుభవం తమ కేర్​ డిగ్రీ కళాశాలకు ఉందని డైరెర్టర్​ నరాల సుధాకర్​ తెలిపారు. అంతర్జాతీయ హాకీ ప్లేయర్​గా రాణిస్తున్న గుగ్లూత్​ సౌమ్య (Gugluth Soumya) తమ కళాశాల విద్యార్థిని అని చెప్పేందుకు గర్విస్తున్నామన్నారు.

Care Degree College | ​శిక్షణ, ప్లేస్‌మెంట్ సెల్..

విద్యార్థులను కేవలం చదువులకే పరిమితం చేయకుండా, వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన ప్రత్యేక కోచింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాసులు నిర్వహించే ప్రత్యేక విభాగాలు తమ కళాశాలలో ఉన్నాయని నరాల సుధాకర్  తెలిపారు. విద్యార్థినులు, విద్యార్థులకు అనుకూలమైన, క్రమశిక్షణతో కూడిన ప్రశాంతమైన వాతావరణంతో పాటు బస్టాండ్​, రైల్వేస్టేషన్లకు కూతవేటు దూరంలో తమ కళాశాల నెలకొల్పబడిందన్నారు.

Care Degree College | కొత్త కోర్సుల వివరాలివే..

ఈ సందర్భంగా కళాశాలలో బీఎస్సీ ఎంఎల్​టీ, బీఎస్సీ డిజిటల్​ మార్కెటింగ్​, బీఎస్సీ నుట్రీషియన్​, బీఎస్సీ డాటా సైన్స్​, బీఏ(హెచ్​ఈపీ) లాంటి కొత్త కోర్సులు కళాశాలలో నిర్వహిస్తున్నాట్లు నరాల సుధాకర్​ తెలిపారు. అలాగే బీబీఏ, బీసీఏ, బీఎస్సీ బీజడ్​సీ, కంప్యూటర్​ సైన్స్​ కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్​ కోసం తమ కళాశాలలో చేరాలని ఆయన కోరారు. వివరాలకు కేర్ డిగ్రీ కాలేజీ, తిలక్ గార్డెన్ కాంప్లెక్స్, స్టేషన్ రోడ్, నిజామాబాద్. 9949925676, 9951382993, 9949460640లలో సంప్రదించవచ్చన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్​ బాలకృష్ణ, కళాశాల ఇన్​ఛార్జీలు సందేశ్​ సందీప్​, కిరణ్​ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Revanth Reddy Convoy | నా కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ ఆపొద్దు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి...

Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి...

CBSE Three Language Rule | CBSC బోర్డు కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు కొత్త త్రీ-లాంగ్వేజ్ రూల్..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE Three Language Rule | సీబీఎస్ఈ బోర్డు...

BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పది: కలెక్టర్​

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడంలో...