తెలంగాణRevanth Reddy Convoy | నా కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ ఆపొద్దు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక...

Revanth Reddy Convoy | నా కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ ఆపొద్దు.. సీఎం రేవంత్​రెడ్డి కీలక నిర్ణయం

సీఎం రేవంత్​రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ను ఆపొద్దని పోలీసులను ఆదేశించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్​ కోసం ట్రాఫిక్​ను ఆపొద్దని పోలీసులను ఆదేశించారు.

పెట్రోల్​, డీజిల్​ ఆదా చేయాలని ఇటీవల ప్రధాని మోదీ (PM Modi) ప్రజలను కోరిన విషయం తెలిసిందే. ఆయన స్వయంగా తన కాన్వాయ్​లో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. ప్రధాని సూచన మేరకు ప్రజలతో పాటు పలువురు నాయకులు ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు సీఎం రేవంత్​రెడ్డి తన కాన్వాయ్​లో వాహనాల సంఖ్యను నాలుగుకు తగ్గించారు.

Revanth Reddy Convoy | ప్రజలకు ఇబ్బందులు లేకుండా..

సీఎం, మంత్రుల కాన్వాయ్​ వస్తే పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్​ నిలిపి వేస్తారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఇప్పటికే ట్రాఫిక్​ రద్దీతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మధ్యలో కాన్వాయ్​ల కోసం వాహనాలను ఆపితే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తన కాన్వాయ్​ కోసం వాహనాలను ఆపొద్దని సీఎం పోలీసులను ఆదేశించారు. ట్రాఫిక్‌ మధ్యనే కాన్వాయ్‌ వెళ్లాలని నిర్ణయించారు. కాగా ఇటీవల సీఎం శంషాబాద్​ నుంచి తన నివాసానికి ట్రాఫిక్​లోనే వచ్చారు. ఇదే విధానాన్ని అనుసరించాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

దీనిని కూడా చదవండి : Bandi Bhagirath Case | బండి భగీరథ్​పై లుక్‌ అవుట్ నోటీసులు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Police Transfers | పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని పెంచుతాయి: ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Police Transfers | పారదర్శక బదిలీలు సిబ్బందిలో విశ్వాసాన్ని...

Bandi Bhageerath POCSO | బండి భగీరథ్​ ఎక్కడ ఉన్నాడో సీఎంకు తెలుసు : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Bhageerath POCSO | బీఆర్​ఎస్​ నాయకుడు...

Care Degree College | అత్యుత్తమ బోధనకు చిరునామా ‘కేర్​ డిగ్రీ కళాశాల’: డైరెక్టర్​ నరాల సుధాకర్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Care Degree College | నగరంలో రెండు...

Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి...