TOMCOM Job Scam | ‘విదేశాల్లో ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేస్తున్న మంత్రి’

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మంత్రి వివేక్​ వెంకట్ స్వామి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ఆరోపించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TOMCOM Job Scam | బీఆర్ఎస్​ నాయకుడు ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని టామ్​కామ్​ పేరిట మంత్రి వివేక్​ వెంకట్ స్వామి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ (RS Praveen Kumar) గురువారం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో 2014లో TOMCOM ఏర్పాటు చేశారన్నారు. అయితే దానిని సైతం కాంగ్రెస్​ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపించారు. ఇటీవల జర్మనీలో ఉద్యోగాల కోసం ప్రకటన ఇచ్చారన్నారు. దీంతో వందలాది మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఉచితంగా కల్పించాల్సిన అవకాశాల కోసం ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.4.10 లక్షలు వసూలు చేశారని ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ ఆరోపించారు.

TOMCOM Job Scam | మటన్​ కొట్టిస్తున్నారు

జర్మనీలో ఉద్యోగాల కోసం 200 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారన్నారు. అయితే 10 మందిని కూడా అక్కడికి పంపించలేదని ఆరోపించారు. ఓ యువకుడికి మెకాట్రానిక్స్ విభాగంలో ఉద్యోగం అని చెప్పి పంపించారని, తీరా అక్కడకు వెళ్లాక.. బీఫ్, మటన్, ఇతర మాంసం కట్ చేయాలని చెప్పారన్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం ఆడుకుంటుందోందని ఆగ్రహం వ్యక్తం చేవారు. మంత్రి వివేక్​ తన కొడుకు వంశీకృష్ణను కూడా ఇలాగే పంపిస్తారా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Dumping Yard | డంపింగ్ యార్డ్ తొలగించే వరకు పోరాటం : ఎంపీ ఈటల

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *