అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా (Siddipet District)లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా బి. అరుణ పని చేస్తున్నారు. గ్రామంలోని ఓ వ్యక్తి రెండు ఇళ్లకు చెందిన మ్యుటేషన్ దరఖాస్తును ప్రాసెస్ చేసి పై అధికారులకు పంపడానికి ఆమె రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.15 వేలకు తగ్గించారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ACB Trap | కారోబార్ సాయంతో..
జీపీ కార్యదర్శి అరుణ మంగళవారం ఉదయం కారోబర్ దాసరి సంతోష్ సాయంతో లంచం తీసుకుంది. ఫిర్యాదుదారు రూ.15 వేలు కారోబార్కు ఇవ్వగా, అతడు ఆ మొత్తాన్ని అరుణకు అందించాడు. ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా రాష్ట్రంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం, మ్యూటేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి సైతం వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Bank Five Day Week | బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని విధానం అమలు చేయాలి: కల్వకుంట్ల కవిత