అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Census Handbook Nizamabad | జిల్లా (Nizamabad) జనగణన హ్యాండ్‌బుక్ రూపకల్పన కోసం ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన సమాచారం అందించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు.
Census Handbook Nizamabad | విద్యావైద్యం
విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా, సమాచార వ్యవస్థ, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు తదితర విషయాలపై ఖచ్చితమైన సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రాబోయే పదేళ్ల పాటు సమాచార సేకరణ, ప్రణాళికల రూపకల్పనకు ఎంతో ఉపయుక్తమైన గ్రంథంగా నిలుస్తుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సమాచార సేకరణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారం రోజుల్లో సంబంధిత శాఖలు సమాచారాన్ని సేకరించి అందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్‌ఛార్జి సీపీవో కిషన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Smart Ration Cards | రేషన్‌కార్డులపై కీలక అప్డేట్.. 1.06 కోట్ల స్మార్ట్‌కార్డులు