అక్షరటుడే,నిజామాబాద్ అర్బన్: Junior Colleges TC Issue | టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఇందూర్ (Nizamabad) వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇంటర్మీడియట్ కార్యాలయ (Intermediate education) అధికారికి వినతిపత్రం అందజేశారు.
Junior Colleges TC Issue | అదనపు రుసుము వసూలు చేస్తున్నారు..
ఈ సందర్భంగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, నిజామాబాద్ జోనల్ కన్వీనర్ సందు ప్రవీణ్ మాట్లాడుతూ.. నగరంలోని గంగాస్థాన్ ప్రాంతంలో ఉన్న కళాశాలలతో పాటు మరికొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విద్యార్థులకు ఫీజు బకాయిల పేరుతో టీసీలు, ఇతర విద్యా ధ్రువపత్రాలను ఇవ్వట్లేదన్నారు. దీంతో వారు పైచదువులకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే డబ్బులు అడుగుతున్నారని.. ఫీజులు కట్టలేదని సైతం సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని ఆరోపించారు.
Junior Colleges TC Issue | అనుమతులు లేకున్నప్పటికీ..
జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల విషయంలో ఫైర్ సేఫ్టీ, మున్సిపల్ శాఖ, ప్రభుత్వ అనుమతులు లేకున్నప్పటికీ దర్జాగా ఫీజులు వసూలు చేస్తున్నారని.. అధికారులు తనిఖీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్లలో గాలి ఆడని గదుల్లో విద్యాబోధనకు అధికారులు ఎలా అనుమతి ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. అధికారులను కలిసిన వారిలో ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, రూరల్ అధ్యక్షుడు యాటకర్ల దేవేష్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: KBR Park One Way | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలు