అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల మౌలిక వసతులు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Godavari Pushkaralu | వచ్చే ఏడాది జూన్, జూలై మాసాల్లో..
వచ్చే ఏడాది జూన్, జూలై మాసాల్లో జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం పుష్కర క్షేత్రాలకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. గోదావరి, మంజీర, హరిద్ర నదుల కలయికతో త్రివేణి సంగమ ప్రాంతంగా భాసిల్లుతున్న రెంజల్ మండలం కందకుర్తి వద్ద గల పుష్కర ఘాట్ తో పాటు, నవీపేట మండలం యంచ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్లను ఆమె పరిశీలించారు. కందకుర్తి వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పుష్కర ఘాట్ నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. గోదావరిలో నీటి ప్రవాహం కారణంగా ఇరిగేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనుల విషయంలో కొంత జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
Godavari Pushkaralu | నీటి ప్రవాహం తగ్గగానే.
నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పనులను వేగవంతంగా చేపట్టి, మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల ప్రగతిని వారానికి కనీసం రెండు పర్యాయాలు పర్యవేక్షణ చేయాలని ఆర్డీవో, తహశీల్దార్లకు సూచించారు. అప్రోచ్ రోడ్లు, కల్వర్టుల ఏర్పాటు వంటి పనులను ఏకకాలంలో సమాంతరంగా చేపట్టేలా చూడాలన్నారు. యంచ వద్ద చేపట్టనున్న పుష్కర ఘాట్, పార్కింగ్ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. భక్తులకు రవాణా వసతి, పార్కింగ్, టాయిలెట్స్, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, దుస్తులు మార్చుకునే గదులు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, బోధన్ ఆర్డీవో విజయ కుమారి, తహశీల్దార్లు శ్రవణ్, వెంకట రమణ ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Electric Shock | నగరంలో విషాదం.. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్‌షాక్‌తో మహిళ మృతి