అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Electric Shock | నగరంలో విషాదం నెలకొంది. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్‌షాక్‌తో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
Nizamabad Electric Shock | హమాల్వాడిలో..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరం (Nizamabad)లోని మిర్చికాంపౌండ్లో ఉదయం ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన మహిళకు విద్యుత్‌షాక్ తగిలింది. ఈ ధాటికి మహిళ ముక్కులుమక్కలైంది. భారీ శబ్ధం రావడంలో ఉలిక్కిపడ్డ స్థానికులు వచ్చి చూసేసరికి మహిళ మృతి చెందిఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతిచెందిన మహిళను పాత సామాన్లు సేకరించే మహిళగా స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Nandi Gutta Mining | నంది గుట్టను మైనింగ్ నుంచి రక్షించాలి : కలెక్టర్‌కు బోడ మహేందర్ విజ్ఞప్తి