Nandi Gutta Mining | నంది గుట్టను మైనింగ్‌ నుంచి రక్షించాలి : కలెక్టర్‌కు బోడ మహేందర్‌ విజ్ఞప్తి

నంది గుట్టపై మైనింగ్‌ నిర్వహిస్తే గుట్టకు, ఆలయాలకు, పరిసర పర్యావరణానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామ ప్రజల ఆధ్యాత్మిక మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nandi Gutta Mining | నిజామాబాద్‌ Nizamabad జిల్లా మోపాల్‌ మండలం ముదక్‌పల్లి గ్రామ పరిధిలోని పవిత్రమైన నంది గుట్టను మైనింగ్‌ కార్యకలాపాల నుంచి రక్షించాలని కలెక్టర్‌ను ఓబీసీ సెల్‌ జిల్లా కోశాధికారి బోడ మహేందర్‌ నిజామాబాద్‌ జిల్లా కోరారు. నంది గుట్టపై, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పవిత్రతను కాపాడేందుకు అక్కడ ఎలాంటి మైనింగ్‌ అనుమతులు మంజూరు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

akshara today .jpgtample 2

Nandi Gutta Mining | పలు ఆలయాల నిలయం..

ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ముదక్‌పల్లి గ్రామంలో నంది గుట్ట ప్రముఖమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా ఉందని తెలిపారు. గుట్టపై అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి బేస్‌మెంట్‌, నాలుగు పిల్లర్లు నిర్మించారని, దీనికితోడు అక్కడ శివాలయం కూడా ఉందని పేర్కొన్నారు. గుట్టకు ఆనుకుని సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఆలయాలు ఉన్నాయని, గ్రామ ప్రజలు ఈ ఆలయాలను ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారని వివరించారు.

akshara today .jpgtample

Nandi Gutta Mining | మొరం తవ్వేందుకు ప్రయత్నాలు..

అయితే, కొంతమంది నాయకులు నంది గుట్ట పక్కన ఉన్న అసైన్డ్‌ భూమిని లీజుకు తీసుకుని మైనింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మహేందర్‌ తెలిపారు. సంబంధిత సర్వే నంబరులో మొరం అందుబాటులో లేకపోవడంతో, పక్కనే ఉన్న నంది గుట్ట నుంచి మొరం తవ్వేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు సహకరిస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

నంది గుట్టపై మైనింగ్‌ నిర్వహిస్తే గుట్టకు, ఆలయాలకు, పరిసర పర్యావరణానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, గ్రామ ప్రజల ఆధ్యాత్మిక మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు.

akshara today .jpg boda 2

Nandi Gutta Mining | నంది గుట్టను కాపాడాలి

నంది గుట్ట ప్రాధాన్యాన్ని గుర్తించి, అక్కడ ఎలాంటి మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతులు మంజూరు చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను బోడ మహేందర్‌ కోరారు. అయ్యప్ప స్వామి ఆలయం, శివాలయంతో పాటు పరిసరాల్లోని ఇతర ఆలయాల పవిత్రతను కాపాడాలని, భవిష్యత్తులోనూ నంది గుట్టపై మైనింగ్‌ అనుమతులు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *