Bathukamma Celebrations | నిషితా స్కూల్​లో బతుకమ్మ సంబరాలు

నగరంలోని నిషితా ఇంటర్నేషనల్ స్కూల్​లో సోమవారం బతుకమ్మ, దాండియా వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Bathukamma Celebrations | నగరంలోని నిషితా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిషితా ఇంటర్నేషనల్ స్కూల్​లో సోమవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలు, దాండియా ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ ఆడారు.

Bathukamma Celebrations | విద్యార్థుల్లో ఐకమత్యం..

నగర మేయర్ ఉమారాణి ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐకమత్యం, సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బతుకమ్మ విశిష్టతను వివరించారు. మేయర్​ ఉమారాణి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. పాఠశాల నిర్వాహకులు వినయ్ కుమార్, ఛైర్మన్ నిఖిల్, డైరెక్టర్ పూజ, కో ఆర్డినేటర్ రాజు, ప్రిన్సిపల్ దియా బెనర్జీ పాల్గొన్నారు.

bathukamma

దీనిని కూడా చదవండి : Mobile Theft Arrest | రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడి అరెస్ట్​..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *