Mobile Theft Arrest | రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడి అరెస్ట్​..

నగరంలోని రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Mobile Theft Arrest | నగరంలోని (Nizamabad) రైల్వేస్టేషన్​ ఆవరణలో మొబైల్​ చోరీ నిందితుడిని రైల్వే పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ మేరకు రైల్వే ఎస్సై సాయిరెడ్డి వివరాలు వెల్లడించారు.

Mobile Theft Arrest | తనిఖీలు నిర్వహిస్తుండగా..

నగరంలోని రైల్వేస్టేషన్​ ఆవరణలోని 1వ ప్లాట్​ఫాంపై జీఆర్​పీ, ఆర్​పీఎఫ్​, ఐడీ పార్టీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించగా తన పేరు కమరుద్దీన్​గా పేర్కొన్నాడు. పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చి విచారించగా గతంలో మొబైల్​ చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఇతడిపై గతంలోనూ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద రూ.16వేల విలువైన ఫోన్​తో పాటు మరో ఐదు ఫోన్లు సైతం  స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: తప్పు ఎవరు చేసినా తప్పే.. రేవంత్ సర్కార్‌పై కోమటిరెడ్డి హాట్ కామెంట్స్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *