Police Essay Competition | పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీలు

నిజామాబాద్​ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీసులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Police Essay Competition | జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీసులకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నారు. సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Police Essay Competition | కానిస్టేబుల్​ స్థాయి నుంచి ఏఎస్సై వరకు..

కానిస్టేబుల్ నుండి ఏఎస్సై స్థాయి వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా ‘వ్యాస రచన పోటీలు’ నిర్వహించారు. తెలుగు ఉర్దూ, ఇంగ్లిష్​ భాషల్లో ఉదయం నుండి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించారు. ‘ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పోలీసుల నుండి ఎటువంటి సేవలను ఆశిస్తారు’ అంశంపై పోటీలు నిర్వహించారు. ఎస్సై ఆపై స్థాయి వరకు ‘పౌరుల మన్ననలు పొందడానికి పోలీసులు చేయాల్సిన కృషి’పై అంశంపై పోటీలు జరిగాయి.

ఇది కూడా చదవండి: లగ్జరీ కార్లతో కలరింగ్.. మహిళా పోలీసులే టార్గెట్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *