Bodhan Adulterated Oil | బోధన్‌లో కల్తీ నూనె తయారీ గుట్టురట్టు.. 900 లీటర్లు స్వాధీనం!

Naresh Chandan

అక్షరటుడే, బోధన్‌: Bodhan Adulterated Oil | ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించేలా పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లను ఉపయోగించి అక్రమంగా నూనె తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

నిజామాబాద్‌ Nizamabad జిల్లా బోధన్‌ పట్టణంలోని గాంధీనగర్‌ ప్రాంతంలో చేపట్టిన ఈ తనిఖీల్లో 900 లీటర్ల కల్తీ నూనెను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Bodhan Adulterated Oil | పశువుల అవశేషాలతో నూనె తయారీ?

పోలీసులకు అందిన సమాచారం మేరకు చీతా ఫోర్స్‌, స్థానిక పోలీసులు గాంధీనగర్‌లోని సఫీఉద్దీన్‌ నివాసంపై దాడి చేశారు. అక్కడ పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లను వేడి చేసి నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నూనెను అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ చేపట్టారు.

Bodhan Adulterated Oil | మహారాష్ట్రకు విక్రయిస్తున్నట్లు సమాచారం

తయారు చేసిన నూనెను మహారాష్ట్రకు తరలించి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ అక్రమ వ్యాపారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? నూనెను ఎక్కడెక్కడ విక్రయించారు? దాని వినియోగం ఏ విధంగా జరిగింది? అనే అంశాలపై విచారణ చేపట్టాల్సి ఉంది.

Bodhan Adulterated Oil | ముగ్గురు అదుపులోకి..

ఈ కేసులో మహమ్మద్‌ సఫీఉద్దీన్‌, మహమ్మద్‌ సోఫిఉద్దీన్‌, అబ్దుల్‌ అన్వర్‌లను అదుపులోకి తీసుకున్నట్లు బోధన్‌ పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 900 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

ఈ దాడిలో చీతా టీమ్‌ ఎస్‌ఐ శ్రీను, ఆయన సిబ్బంది, బోధన్‌ ఎస్‌ఐ రామ్‌, స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే అక్రమ తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

స్వాధీనం చేసుకున్న నూనె స్వభావం, దాని వినియోగం, ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలపై సంబంధిత అధికారుల పరీక్షలు, దర్యాప్తు వివరాలు కీలకం కానున్నాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *