Telangana University Attack | తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య మాటల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్‌పల్లి: Telangana University Attack | తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)లో విద్యార్థుల మధ్య మాటల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థి తనకు తెలిసిన బయటి వ్యక్తులను రప్పించి దాడి చేయించిన ఘటన కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Telangana University Attack | బయటి వ్యక్తులతో..

హాస్టల్ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మాస్యూటికల్ నాల్గో సంవత్సరం చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో మాట్లాడుతుండగా, అప్లైడ్ ఎకనామిక్స్ రెండో సంవత్సరం విద్యార్థి ఏదో విషయంపై అదే సమయంలో మాట్లాడాడు. దీంతో సీనియర్ విద్యార్థులకే ఎదురు చెబుతావా..? అంటూ సదరు సీనియర్​ జూనియర్​పై వాగ్వాదానికి దిగి దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఈ సీనియర్​ విద్యార్థి యూనివర్సిటీతో సంబంధం లేని తనకు పరిచయమున్న బయటి వ్యక్తులకు ఫోన్ చేయగా, ఐదుగురు వ్యక్తులు మాస్కులు ధరించి యూనివర్సిటీ హాస్టల్‌కు వచ్చి జూనియర్​పై దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో జూనియర్​ తలకు తీవ్ర గాయమైంది. దీంతో హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్​కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేశారు. దాడిలో గాయపడిన జూనియర్​ అదే అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసుల సూచన మేరకు అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

Telangana University Attack | గతంలోనూ బెదిరింపులు?

ఈ ఘటనకు పాల్పడ్డ సీనియర్​ గతంలోనూ జూనియర్ విద్యార్థులను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో యూనివర్సిటీ వార్డెన్ జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ మరోసారి జూనియర్ విద్యార్థిపై బయటి వ్యక్తులను రప్పించి దాడి చేయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీ హాస్టల్‌లోకి బయటి వ్యక్తులు మాస్కులు ధరించి ప్రవేశించి విద్యార్థిపై దాడికి పాల్పడటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కేసు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి..: Salura Sarpanch Protest | అధికారిక కార్యక్రమాలను బహిష్కరించిన సాలూర మండల సర్పంచు​లు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *