అక్షరటుడే, ఆర్మూర్: Turmeric Farmers | సాంగ్లీ మార్కెట్లో పసుపు ధర పెరగడం రైతులకు హర్షించదగ్గ విషయమని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు.
Turmeric Farmers | సాంగ్లీ మార్కెట్లో..
రైతులందరూ తమ పసుపును తొందరపడి అమ్మవద్దని సూచించారు. ఏపీఈడీఏ (APEDA)(ఆపెడ) ద్వారా రైతులు నేరుగా పసుపు ఎగుమతి చేసే అవకాశాన్ని కేంద్రం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పసుపును ఇతర దేశాలకు ఏగుమతి చేసి మంచి ధరను పొందాలని పేర్కొన్నారు. పసుపు రైతు ధర పెరగడానికి కృషి చేసిన జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind)కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు శేషగిరి లింగం, జిల్లా కార్యవర్గ సభ్యులు చిట్టి భాజన్న తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana University Attack | తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్పై సీనియర్ దాడి