Adloor Ooru Panduga | అడ్లూర్‌లో అంబరాన్నంటిన ఊర పండగ సంబరం

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామం మూడు రోజులుగా పండగ వాతావరణంలో మునిగిపోయింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Adloor Ooru Panduga | కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో గత మూడు రోజులుగా పండగ వాతావరణం కొనసాగుతోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి పాడి పంటలు పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఊర పండగను గ్రామస్థులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Adloor Ooru Panduga | శుక్రవారం వరకు..

బుధవారం ప్రారంభమైన ఈ పండగ శుక్రవారం వరకు కొనసాగనుంది. గ్రామంలోని ఘడి మైసమ్మ ఆలయం వద్ద అమ్మవారి ప్రతిరూపాలను ప్రతిష్ఠించి గ్రామస్థులు కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

గురువారం పండగలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కొలుపులమ్మ ఊరేగింపు. గ్రామంలోని ప్రతి వాడలో ఊరేగిన కొలుపులమ్మ ఘడి మైసమ్మ వద్దకు చేరుకుని భవిష్యవాణి వినిపించింది. గ్రామ పెద్దలు ఐక్యంగా ఉండి అమ్మవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూజలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

ప్రతి మూడేళ్లు, ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఊర పండగకు గ్రామస్థులంతా ఒక్కటై ముందుకు రావడం విశేషం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పండగలో పాల్గొనడంతో అడ్లూర్ లో పండగ శోభ సంతరించుకుంది. శుక్రవారం చివరి రోజు సందర్భంగా గ్రామస్థులు ఊరి బయటకు వెళ్లి వనభోజనాలు చేయనున్నారు. దీంతో ఈ మూడు రోజుల పండగకు ఘనంగా ముగింపు పలకనున్నారు.

ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకుంటే తప్పేంటీ..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *