అక్షరటుడే, కామారెడ్డి: Failed Seeds Farmers | మొలకెత్తని విత్తనాలు సరఫరా చేసి రైతులను నష్టపరిచిన ప్రైవేట్ వ్యాపారిపై చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని( Kamareddy) కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
Failed Seeds Farmers |కలెక్టరేట్‌కు తరలివెళ్లిన నాయకుల..
జిల్లా సమావేశం అనంతరం కిసాన్ సంఘ్ నాయకులు గురువారం కలెక్టరేట్ కు వెళ్లి అదనపు కలెక్టర్ ను కలిసి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. తాడ్వాయి మండలంలో గత నెలలో సుమారు 100 మంది రైతులు 200 ఎకరాల వరకు ప్రైవేట్ వ్యాపారి వద్ద తీసుకున్న బీర విత్తనాలను అగ్రిమెంట్ ప్రకారం వేశారని తెలిపారు. ఆ కొత్త విత్తనాలు ఎక్కడా మొలవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పెట్టుబడి నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆ వ్యాపారిపై వెంటనే చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
Failed Seeds Farmers |ధాన్యం కొనుగోలు కేంద్రాలేవి..?
వడ్ల కొనుగోలు కేంద్రాలను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినా ఎక్కడా కొనుగోలు జరగడం లేదని, దీంతో ప్రైవేట్ వ్యాపారులు రూ.3400, రూ.3,500 ఉన్న ధరను రూ.2,400కు దించేశారని వాపోయారు. వెంటనే వడ్ల కొనుగోలు ప్రారంభించి, కొనుగోలు కేంద్రంలోనే రైతులకు కాంటా కాగానే ట్రక్ చిట్టీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎల్ నినో ప్రభావంతో వరి వేయవద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతోందని, అది బాగానే ఉన్నా వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంటు ఇస్తారో ఎక్కడా ప్రకటించడం లేదన్నారు.
ఎన్ని గంటలు కరెంటు ఇస్తారో తెలిస్తే దానికి అనుగుణంగా రైతు పంట పెట్టుకోగలుగుతాడని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు ఇస్తుందో ప్రకటించాలని కోరారు. అదే విధంగా ఆరుతడి పంటల్లో కామారెడ్డి జిల్లాలో జొన్న పంట అధికంగా వేస్తారని, గత సంవత్సరం ఆంక్షలు విధించి ఎకరాకు 10 క్వింటాళ్లే కొనుగోలు చేశారని, కానీ రైతులకు 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని గుర్తుచేశారు. రైతుకు ఎంత దిగుబడి వస్తే అంత పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి ఆరుతడి పంటలు వేయించాలని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకుంటే తప్పేంటీ..?