అక్షరటుడే, భీమ్‌గల్: Karepalli High Court Advocate | సాధారణ వ్యవసాయ కుటుంటం నుంచి వచ్చిన ఓ యువతి హైకోర్టు న్యాయవాదిగా ఎదిగింది. భీమ్‌గల్(Bheemgal) మండలం కారేపల్లి గ్రామానికి చెందిన బాదావత్ అఖిలా యాదవ్ తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Karepalli High Court Advocate | హైదరాబాద్‌లోని హైకోర్టు ప్రాంగణంలో..
హైదరాబాద్‌లోని హైకోర్టు ప్రాంగణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె న్యాయవాదిగా నమోదయ్యారు. కారేపల్లి గ్రామానికి చెందిన సామాన్య వ్యవసాయ కుటుంబం గోవింద్ నాయక్, సరిత దంపతుల ఏకైక కుమార్తె అఖిల. న్యాయవాద వృత్తిపై ఆసక్తితో ఆర్మూర్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పెండెకంటి లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ అభ్యసించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అఖిల మాట్లాడుతూ.. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడంతో పాటు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి హైకోర్టు న్యాయవాది స్థాయికి ఎదిగిన ఆమెను కుటుంబ సభ్యులు, మిత్రులు, గ్రామస్థులు అభినందించారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ తన భార్యతో విడాకులు తీసుకుంటే తప్పేంటీ..?