Journalists Housing | జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల్సిందే.. టీడబ్ల్యూజేఎఫ్​ డిమాండ్​

జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Journalists Housing | జిల్లాతో పాటు మండల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను త్వరితగతిన జారీ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్​ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతి పత్రాన్ని అందజేశారు.

Journalists Housing | పెండింగ్​ సమస్యలను..

దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జర్నలిస్టులు కృషిచేస్తున్నారని తెలిపారు. ఎండనక, వాననక విధుల్లో ఉంటున్నారని.. తెలంగాణ (Telangana) ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడామన్నారు. ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారని.. పరిస్థితులు మారినా..ప్రభుత్వాలు మారినా.. జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం మార్పు రావట్లేదన్నారు.

Journalists Housing | రెండు వర్కింగ్​ జర్నలిస్ట్​ చట్టాలను..

ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను యూనియన్ గవర్నమెంట్ కోడ్​ల కింద మార్చేసి హక్కులను కాలరాసిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని.. అటు యూనియన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదన్నారు.. చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రెడిటేషన్ కార్డులు సైతం సకాలంలో ఇవ్వడం లేదని వాపోయారు. అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రెడిటేషన్ కార్డులు జారీచేస్తున్నారని.. అయితే వాటిని అర్హులందరికీ ఇవ్వాలని కోరారు. అలాగే ఒకే యూనియన్ నుంచి ప్రాతినిథ్యం వహించే వారిని అక్రిడిటేషన్ కమిటీల నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. అందరికి సమాన ప్రాతినిథ్యం కల్పించాలని సూచించారు.

Journalists Housing | హెల్త్​కార్డులివ్వాలి..

Journalists Housing

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నరలిస్టుకూ హెల్త్​ కార్డులివ్వాలని.. కంట్రిబూషన్​ను ప్రభుత్వమే జర్నలిస్టుల తరపున చెల్లించాలని టీడబ్ల్యూజేఎఫ్​ ప్రతినిధులు కోరారు. సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఇళ్లస్థలాలు వెంటనే ఇవ్వాలని.. యుద్ధప్రాతిపదికన ప్రక్రియకు శ్రీకారం చుట్టి జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు స్థలాలు కేటాయించాలని విన్నవించారు. రైల్వే పాస్​ల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్​పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్​ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్, జిల్లా నాయకులు మధు, అనిత, ప్రవీణ్, అఖిల్, రాజు, కృష్ణ, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, సురేష్, లక్ష్మణ్, ఆనంద్, లక్ష్మణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: SIR Process | ‘సర్’ సక్సెస్​కు ఆటంకాలెన్నో..! నత్తనడకన సాగుతున్న ప్రక్రియ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *