అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Munnuru Kapu Bhavan | మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగరంలోని(Nizamabad) ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Munnuru Kapu Bhavan | మున్నూరుకాపుల ఆత్మగౌరవానికి ప్రతీకగా..
మున్నూరు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచేలా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ భవనం సామాజిక వర్గ అభ్యున్నతికి, సంఘటిత శక్తికి కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాంభూపాల్, నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రత్నాకర్, గోపికృష్ణ, ప్రీతం తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: శివుడికి ఎంతో ఇష్టమైన 5 నైవేద్యాలు ..