Telangana IPS Transfers | తెలంగాణలో భారీగా IPSల బదిలీ..

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 21 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Telangana IPS Transfers | తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 21 మంది సీనియర్ పోలీసు అధికారులను ట్రాన్స్​ఫర్​ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. హైదరాబాద్ సీపీ సజ్జనార్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో అడిషనల్ డీజీ మహేష్ భగవత్​కు పోస్టింగ్​ ఇచ్చారు.

Telangana IPS Transfers | హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్

బదిలీల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సీపీగా ఉన్న వీసీ సజ్జనార్​కు ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. జైళ్ల శాఖ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్ సౌమ్య మిశ్రాను ఉమెన్​ సేఫ్టీ అండ్​ షీటీం డీజీపీగా నియమించారు. డీజీపీ ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.

Telangana IPS Transfers | ఏసీబీ డీజీగా చారు సిన్హా

స్వాతి లఖ్రాను డీజీపీ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్‌గా నియమించారు. చారు సిన్హాను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. అలాగే సీఐడీ డీజీ అదనపు బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ అనిల్ కుమార్​ టీజీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇక విక్రమ్ సింగ్ మాన్‌కు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ఎం.స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్‌గా నియమించారు. అలాగే అకున్ సబర్వాల్‌కు అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) బాధ్యతలు ఇచ్చారు.

ఇతర నియామకాలు..

ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని ఏసీబీ డైరెక్టర్‌గా, కార్తికేయను మల్టీ జోన్-1 ఐజీగా నియమించారు. రమేశ్ నాయుడుకు రైల్వే ఐజీ బాధ్యతలు అప్పగించారు. జోయల్ డేవిస్‌ను టీజీ-టీఎంఏఆర్ఎస్‌లో జాయింట్ డైరెక్టర్ (రోడ్ సేఫ్టీ), జాయింట్ డైరెక్టర్ (ట్రాఫిక్)గా నియమించారు. గి.చందన దీప్తికి జోగులాంబ జోన్-7 డీఐజీ అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆర్.భాస్కరన్‌కు డీఐజీ (ఇంటెలిజెన్స్) అదనపు బాధ్యతలు అప్పగించారు. కె.నారాయణ నాయక్‌ను జోన్-2 బాసర డీఐజీగా నియమించారు. ఎల్.ఎస్.చౌహాన్‌ డీఐజీ కోఆర్డినేషన్‌గా నియమితులయ్యారు.

సంజయ్ కుమార్ జైన్‌కు అదనపు డీజీపీ (ట్రైనింగ్) బాధ్యతలు, బాలాదేవికి టీజీ-టీఎంఏఆర్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్) పోస్టింగ్ ఇచ్చారు. వి.అరవింద బాబును హైదరాబాద్ సిటీలో డీసీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాలతో ముగిసిన సూచీలు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *